Big News Big Debate: తెలంగాణలో కొనసాగుతున్న లిక్కర్ ప్రకంపనలు.. రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ నోటీసులు అంటున్న BRS..

Updated on: Mar 09, 2023 | 7:02 PM

ఢిల్లీ కేంద్రంగా మొదలైన లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు తెలంగాణ రాజకీయ పార్టీలకు బలంగా తాకాయి. కవితకు ఈడీ నోటీసులు రాజకీయ పెనుభూకంపమే సృష్టించాయి. తెలంగాణ ఆడబిడ్డపై దాడిగా బీఆర్ఎస్‌ నేతలు అంటే...

ఢిల్లీ కేంద్రంగా మొదలైన లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు తెలంగాణ రాజకీయ పార్టీలకు బలంగా తాకాయి. కవితకు ఈడీ నోటీసులు రాజకీయ పెనుభూకంపమే సృష్టించాయి. తెలంగాణ ఆడబిడ్డపై దాడిగా బీఆర్ఎస్‌ నేతలు అంటే… లిక్కర్‌ వ్యాపారం చేయమని తెలంగాణ ఏమైనా చెప్పిందా అంటూ నిలదీస్తోంది బీజేపీ. బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరుగుతున్న కుట్రలో భాగమని ఎమ్మెల్సీ కవిత అంటే.. దర్యాప్తు సంస్ధలు తమపని తాము చేసుకుపోతాయన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మరోవైపు తమ నిజాయితిని నిరూపించుకోకుండా…. కల్వకుంట్ల కుటుంబం ఎందుకు తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తోందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్‌.

Published on: Mar 09, 2023 07:02 PM