Big News Big Debate: సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ టూర్.. పార్టీల మధ్య మాటల యుద్ధం.. లైవ్ వీడియో
సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ టూర్ మళ్లీ పార్టీల మధ్య యుద్ధానికి తెరతీసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధంగా మారాయి. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ గెలవట్లేదు..
సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ టూర్ మళ్లీ పార్టీల మధ్య యుద్ధానికి తెరతీసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధంగా మారాయి. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ గెలవట్లేదు.. గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే సమయంలో బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. ఇదే ప్రసంగంలో సీఎం పదవిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకశక్తులను ఏకం చేస్తామంటూ పవన్ సీఎం ఎలా అవుతారన్నది వైసీపీ ప్రశ్న. వైసీపీపై చేసిన అనుచిత విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు పడ్డాయి. మైకుల ముందు నుంచి సోషల్ మీడియా దాకా జనసేన అధినేత పవన్‌పై నిప్పులు చెరిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు. వైసీపీనే కాదు… అంబటిపై తనకు కోపం లేదంటూ తీవ్ర విమర్శలు. దానికి అంతే స్థాయిలో రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్ కూడా వచ్చింది. మొత్తానికి సత్తెనపల్లిలో మొదలైన వీకెండ్ పొలిటికల్ వైబ్రేషన్ తాడేపల్లికి పాకింది. ఎప్పటివరకూ ఉంటాయో చూడాలి.