Big News Big Debate: తెలంగాణపై ఈసీ స్పెషల్‌ ఫోకస్‌.! ఐటీ దాడుల్లో రాజకీయ కోణముందా ?? లైవ్ వీడియో

|

Nov 09, 2023 | 7:00 PM

తెలంగాణ ఎన్నికల ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన ఇన్‌కంట్యాక్స్ దాడులపై మాటలయుద్ధం మొదలైంది. రాజకీయ కుట్రలో భాగంగానే అధికారపార్టీ బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ తమపై దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. గత కొద్ది నెలలుగా న్యూస్‌ మేకర్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలనాలకు కేంద్రబిందువయ్యారు.

తెలంగాణ ఎన్నికల ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన ఇన్‌కంట్యాక్స్ దాడులపై మాటలయుద్ధం మొదలైంది. రాజకీయ కుట్రలో భాగంగానే అధికారపార్టీ బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ తమపై దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. గత కొద్ది నెలలుగా న్యూస్‌ మేకర్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసిన 24గంటల్లోనే ఐటీ అధికారులు ఇంటి తలుపుతట్టారు. పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్‌కు సిద్ధమవుతున్న వేళ పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 30 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. నామినేషన్ అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్ర అంటూ పొంగులేటి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో పోటీచేయకుండా తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి. చివరకు అధికారులు నామినేషన్‌ వేసేందుకు అనుమతించారు. తనపై కుట్ర పూరితంగానే బీఆర్ఎస్‌ – బీజేపీ కలిసి దాడులు చేయిస్తున్నాయని దేనికైనా రెడీ అంటూ మరోసారి సవాల్‌ విసిరారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి వచ్చినా కాంగ్రెస్‌కు వెళ్లడంతో కక్ష పెంచుకున్నారని కూడా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.