Big News Big Debate: ప్రగతిభవన్ నచ్చకుంటే పేల్చేస్తారా.?తెలంగాణలో ఈ కూల్చుడు.. పేల్చుడు రాజకీయాలేంటి.?(లైవ్)
ప్రగతిభవన్ నచ్చకుంటే పేల్చేస్తారా..? సచివాలయ గుమ్మటాల్లోనూ మతమే గోచరిస్తుందా.? విధానాలు పోయి విధ్వంసాలే అజెండా ఎందుకయ్యాయి..? తెలంగాణలో ఈ కూల్చుడు.. పేల్చుడు రాజకీయాలేంటి.?
తెలంగాణలో రాజకీయ నేతలు మళ్లీ యాక్షన్‌లోకి వచ్చారు. విధానపరంగా విమర్శలు చేసుకుంటే మజా ఏమంటుందిలే అనుకున్నారో ఏమో కానీ విధ్వంసమే మా అజెండా అంటున్నారు. ఎవరూ ఏమాత్రం తగ్గడం లేదు.. ఒకరు ప్రగతిభవన్ పేల్చేస్తా అంటే.. మరొకరు కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని వార్నింగులు ఇస్తున్నారు. అలాగని అంటున్నది ఏమైనా గల్లీ చోటా నాయకులా అంటే కానే కాదు.. జాతీయ పార్టీలను తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న పెద్ద తలకాయలు. వాళ్లే అంత మాట అంటే.. అధికారపార్టీ మాత్రం సైలెంట్‌గా ఉంటుంది… అటు నుంచి కూడా ఏమాత్రం తగ్గకుండా డైలాగులు పేలుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..