Big News Big Debate: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై సుప్రీం కీలక తీర్పు.. నేతల హాట్ హాట్ కామెంట్స్

|

May 03, 2023 | 7:13 PM

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభిస్తే... ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి షాకిచ్చే తీర్పు వచ్చింది. సిట్‌ ఏర్పాటుపై స్టే విధిస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. దీనిపై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంను ఆశ్రయించింది ప్రభుత్వం.

అమరావతి భూకుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం నియమించింది వైసీపీ ప్రభుత్వం. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది. కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే దీనిపై టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ జీవోలను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. కమిటీ ఏర్పాటులో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను పరిగణలోకి తీసుకోలేదని చెప్పింది. సీబీఐ, ఈడీ కూడా దర్యాప్తు చేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ దశలో హైకోర్టు స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Published on: May 03, 2023 07:11 PM