3 కోర్టులు.. 6 తీర్పులు.. చంద్రబాబుకు ఇవాళ బిగ్ డే.?

|

Oct 09, 2023 | 9:15 AM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంబంధించి అక్టోబర్‌ తొమ్మిదవ తేదీ..బిగ్‌ డేగా మారనుంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా తీర్పు రానుంది. ఆ వివరాలు ఇలా..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంబంధించి అక్టోబర్‌ తొమ్మిదవ తేదీ..బిగ్‌ డేగా మారనుంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా తీర్పు రానుంది. ఇక ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై కూడా సోమవారం నాడే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సోమవారం చంద్రబాబుకు అత్యంత కీలకంగా కనిపిస్తోంది. హైకోర్టులో కేసులకు సంబంధించి…అంగళ్లు కేసులో నిందితులు అందరికి బెయిల్‌ ఇచ్చేశారు కాబట్టి…చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు న్యాయవాది వెంకటేష్‌ శర్మ. అయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబు తరఫు లాయర్లు.. రెండు రకాలుగా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారని ఆయన చెబుతున్నారు.

Published on: Oct 09, 2023 09:13 AM