చంద్రబాబు అరెస్ట్‌పై సినీ పరిశ్రమ స్పందించకపోయినా డోంట్‌కేర్ అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని.. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశమయ్యారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇకపై టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదన్న బాలకృష్ణ అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయబోమన్నారు. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోబోనని స్పష్టం చేశారు బాలకృష్ణ. వైసీపీ మంత్రి రోజా ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన బాలకృష్ణ బురద మీద రాయి వేస్తే తిరిగి మీదే పడుతుందని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..