CM Revanth Reddy: 19వ ఆటా తెలుగు మహాసభలకు సీఎంకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా ప్రతినిధుల బృందం అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆటా ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. సీఎంను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ మూడు రోజుల పాటు జరిగే మహాసభలలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన సదస్సులు నిర్వహించనున్నట్లు, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి సభను జయప్రదం చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే