Watch Video: వైసీపీలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వంశీ ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడంపై ఆయన స్పందించారు. మార్పులను వ్యతిరేకించేవారు బయటకు వెళ్లడమే మంచిదన్నారు.
వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వంశీ ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడంపై ఆయన స్పందించారు. పార్టీలో మార్పులను వ్యతిరేకించేవారు బయటకు వెళ్లడమే మంచిదన్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నవారంతా టిక్కెట్లు ఆశిస్తున్నవారే అన్నారు. జగన్ తమకు ఏ అన్యాయం చేయలేదని, బయటకు వెళ్తున్నవారే చెబుతున్నారని అన్నారు. – కేవలం టిక్కెట్లు ఆశించే తాము పార్టీ మారుతున్నామని స్వయంగా వారే చెబుతున్నారని గుర్తుచేశారు. ఎంత మంది పార్టీని వీడి వెళ్లినా వైసీపీకి ఏమీ కాదన్నారు. తనను పోటీ నుంచి తప్పుకోమని ఆదేశిస్తే.. సంతోషంగా సైడవుతానని స్పష్టంచేశారు. టికెట్ ఇవ్వకున్నా పార్టీ జెండా పట్టుకుని ప్రజల్లో తిరుగుతానని మంత్రి అమర్నాథ్ అన్నారు.