మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Updated on: Dec 20, 2025 | 12:59 PM

ఏపీలోని కొత్త డ్వాక్రా మహిళా సంఘాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సుమారు 2 వేల గ్రూపులకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేసింది. ఒక్కో సంఘానికి రూ.15 వేలు చెల్లించాల్సిన అవసరం లేని నిధిని జమ చేసింది. ఈ ఆర్థిక సహాయం ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చు. స్త్రీ నిధి, విద్యాలక్ష్మి పథకాలతో పాటు, 'మన డబ్బులు-మన లెక్కలు' యాప్ ద్వారా చెల్లింపులలో సహాయపడుతుంది.

ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సహాయం అందించింది. అందులో భాగంగా ఒక్కొ గ్రూపు అకౌంట్‌లో రూ.15 వేలు జమ చేసింది. రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపు 2 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేసింది. ఒక్కొ సంఘానికి రూ.15 వేల చొప్పున వారి గ్రూప్ అకౌంట్లో వీటిని జమ చేసింది. 2024 ఆగస్ట్ 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా గ్రూపులకు వీటిని అందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్వాక్రా గ్రూపు సభ్యులు ఈ రూ.15 వేల రివాల్వింగ్ ఫండ్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల వారి సంఘం నిధి పెరుగుతోంది. అంతేకాకుండా బ్యాంకులు వారికి త్వరగా రుణాలు ఇవ్వడానికి వీలుపడుతుంది. అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలు లోన్ పొందవచ్చు. అలాగే డ్వాక్రా మహిళలు వీటిని పొదుపు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో లాభం జరగనుంది. మరోవైపు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణులు మంజూరు చేయిస్తోంది. స్త్రీ నిధి, విద్యాలక్ష్మి పేరుతో లోన్లు మంజూరు చేస్తుంది. ఇక డ్వాక్రా మహిళలకు వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన డబ్బులు-మన లెక్కలు అనే యాప్ కూడా కొత్తగా లాంచ్ చేసింది. ఇలా డ్వాక్రా మహిళల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ

ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు