ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు

Updated on: Dec 13, 2025 | 1:57 PM

ఏపీ కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. కొత్తగా ఏర్పడిన 2 వేల డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్కటి ₹15 వేల చొప్పున ₹3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం నిధిని పెంచి, సభ్యుల ఆర్థిక అవసరాలకు, బ్యాంక్ రుణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలో మహిళల ఖాతాల్లో నగదు జమ కానుంది.

ఏపీలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నూతనంగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలన్నింటికీ రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులు సదరు డ్వాక్రా సంఘం బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి. సంఘం నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకోవడంతో పాటు బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలకు రుణం మంజూరయ్యేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. త్వరలో డ్వాక్రా మహిళల అకౌంట్లో రూ. 15 వేల రూపాయిలు జమ కానున్నాయి. కొత్త సంఘాల జాబితాను ఇప్పటికే జిల్లాలకు అధికారులు పంపారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఫండ్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా లభించనుంది. డ్వాక్రా మహిళల అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. అన్నీ బ్యాంకులు వీరికి రుణాలు సులువుగా అందిస్తున్నాయి. తీసుకున్న రుణాన్ని డ్వాక్రా మహిళలు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లించుకునే అవకాశముంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US Gold Card Visa: ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ పథకం ప్రారంభం

అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..

మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

మా విశ్రాంతి మాటేంటి ?? ప్రశ్నిస్తున్న లోకోపైలట్లు

జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి