మోదీ తెలంగాణ టూర్‌కు అంతా సిద్దం.. ఎన్నికల శంఖారావం పూరించనున్న ప్రధాని..
తెలంగాణలో అక్టోబర్ ఒకటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వేదికగా అక్టోబర్ 3వ తేదీన జరిగే సభలో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ఆయన చెప్పారు. మంగళవారం నిజమాబాద్‌కు వచ్చిన కిషన్ రెడ్డి..
తెలంగాణలో అక్టోబర్ ఒకటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వేదికగా అక్టోబర్ 3వ తేదీన జరిగే సభలో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ఆయన చెప్పారు. మంగళవారం నిజమాబాద్‌కు వచ్చిన కిషన్ రెడ్డి.. అక్టోబర్ మూడో తేదీన జరగబోయే మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ సభ కీలకం కానుందని, తెలంగాణలో కొత్తగా రూ.6 వేల కోట్లతో 800 మెగా వాట్ల ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ప్రధాని జాతికి అంకితం చేస్తారన్నారు కిషన్ రెడ్డి. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించి గవర్నర్ మంచి పని చేశారని, బీఆర్ఎస్‌కు కొమ్ముకాసే వారికి సామాజిక సేవా కోటాలో ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హామీలు అమలు చేసి మోదీ తెలంగాణకు రావాలని కేటీఆర్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన చేతగాని దద్దమ్మ, షాడో సీఎంకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు’ కిషన్ రెడ్డి. ఎవరో అడిగిన ప్రశ్నలను తన వద్ద ప్రస్తావించటం ఏమిటని, ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు వేయద్దంటూ దాటవేశారు.
కేటీఆర్ మాట్లడిన దానికి తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు పనికి రాని ప్రశ్నలు వేస్తారని.. అయన సర్టిఫికెట్ అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. కేటీఆర్ ట్వీట్లు వేసుకుంటూ రాజకీయం చేస్తారని.. తాను ప్రజల్లో ఉండి రాజకీయం చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారని.. పరోక్షంగా కేటీఆర్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి.. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేసి వచ్చానని చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాటలకు తాను భవిష్యత్తులో స్పందిస్తానని తెలిపారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఇక పసుపు బోర్డు గురించి ప్రశ్నించగా.. కేంద్రంతో మాట్లాడక ఆ వివరాలు తెలియజేస్తానని తెలిపారు కిషన్ రెడ్డి.