Telangana: ప్రగతి భవన్‌లో కీలక సమావేశం.. సీఎం కేసీఆర్‌తో మంత్రులు కేటీఆర్, హరీష్ భేటీ..
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రతిపక్షాల అంచనాలకు మించి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతోంది. ఇవాళ ప్రగతి భవన్‌లో కీలక సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్‌తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ మేనిఫెస్టో, అసమ్మతుల బుజ్జగింపులు, సభల నిర్వహణపై చర్చించనునున్నారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోట్ల నేతలను ఫైనల్ చేయనున్నారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రతిపక్షాల అంచనాలకు మించి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతోంది. ఇవాళ ప్రగతి భవన్‌లో కీలక సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్‌తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ మేనిఫెస్టో, అసమ్మతుల బుజ్జగింపులు, సభల నిర్వహణపై చర్చించనునున్నారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోట్ల నేతలను ఫైనల్ చేయనున్నారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్. మరోవైపు సీఎం కేసీఆర్ బహిరంగ సభల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్‌ఎస్. ఈనెల 15, 16న హుస్నాబాద్, జనగామ, భువనగిరిలో కేసీఆర్ పర్యటిచంనున్నారు. 17వ తేదీన సిద్దిపేట, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.