Watch Video: మంత్రి రోజాకు నటి మీనా బాసట.. బండారు వ్యాఖ్యలకు ఖండన

|

Oct 08, 2023 | 11:01 AM

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను నటి మీనా తీవ్రంగా ఖండించారు. ఓ మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తన వ్యాఖ్యల పట్ల బండారు తక్షణమే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని మీనా కోరారు.

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను నటి మీనా తీవ్రంగా ఖండించారు. ఓ మహిళా మంత్రిపై బండారు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తన వ్యాఖ్యల పట్ల బండారు తక్షణమే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని మీనా కోరారు. రోజాపై వ్యాఖ్యలను ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీమణులు ఖండించారు. కుష్బూ సుందర్, నవనీత్ కౌర్, రాధిక శరత్ కుమార్, రమ్య కృష్ణ,  నటి కవిత మంత్రి రోజాకు బాసటగా నిలిచారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Published on: Oct 08, 2023 11:00 AM