Watch Video: పోలీసులకే చుక్కలు చూపించిన హ్యాకర్లు.. ఏం చేశారంటే..

|

Jun 10, 2024 | 11:07 AM

తెలంగాణ పోలీస్‌ యాప్‌లను హ్యాక్‌ చేసిన నిందితుడ్ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన Hawk Eye, TSCOP యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ పోర్టల్‌ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ను గుర్తించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు.

తెలంగాణ పోలీస్‌ యాప్‌లను హ్యాక్‌ చేసిన నిందితుడ్ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన Hawk Eye, TSCOP యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ పోర్టల్‌ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ను గుర్తించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. అరెస్టయిన హ్యాకర్‌కు సైబర్‌ నేరాల చరిత్ర ఉందని.. గతంలో ఇలాంటి హ్యాకింగ్‌ కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక డేటా లీక్‌ కాలేదని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హాక్‌ ఐ డేటాలోని నిర్దిష్ట విభాగాల్లోకి హ్యాకర్లు యాక్సెస్‌ పొంది ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on