PM Modi: దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Updated on: Mar 30, 2025 | 1:35 PM

ప్రధాని మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లోని RSS కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్‌లో RSS వ్యవస్థాపకులు హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్‌ బుక్‌లో ప్రధాని తన సందేశం రాశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

ప్రధాని మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లోని RSS కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్‌లో RSS వ్యవస్థాపకులు హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్‌ బుక్‌లో ప్రధాని తన సందేశం రాశారు. స్మృతి మందిర్‌కు రావడంతో తన హృదయం ఉప్పొంగిందన్నారు. లక్షలాది స్వయంసేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశసేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్‌- ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు. మన కృషితో భారతమాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు.

2047కల్లా వికసిత్‌ భారత్‌ సాకారం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. మన ముందు మరిన్ని మహత్తర లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. నాగ్‌పూర్‌లోని RSS కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ… అక్కడి స్మృతి మందిర్‌లో RSS వ్యవస్థాపకులు హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌కు నివాళులు అర్పించారు. దేశసేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్‌ ప్రేరణనిస్తుందన్నారు. ప్రపంచ దేశాలకు భారత్‌ మార్గదర్శనం చేయనుందని మోదీ అన్నారు. దేశ అభివృద్ధి మన కళ్లముందే సాకారం అవుతోందని తెలిపారు. మయన్మార్‌ భూకంప బాధితులకు భారత్‌ నుంచే తొలిసాయం అందిందని తెలిపారు. కోవిడ్‌ సమయంలోనూ ప్రపంచానికి భారత్‌ అండగా నిలిచిందని గుర్తు చేశారు.

Published on: Mar 30, 2025 12:38 PM