PM Modi: కాంగ్రెస్ వల్లే ఈశాన్య రాష్ట్రాలకు ఈ దుస్థితి.. మోదీ ఫైర్..

Updated on: Sep 13, 2025 | 12:02 PM

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరి స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని ఆరోపించారు. కానీ కానీ తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిజోరాం రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిజోరాం రాష్ట్రంలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా రూ.8,070 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరాబీ – సైరాంగ్ రైల్వే లైన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కొందరి స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలపై భారీగా పన్నులు విధించి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది” అని ఆరోపించారు.

బైరాబీ – సైరాంగ్ రైల్వే లైన్ ప్రారంభం ఈ ప్రాంతానికి ఒక కొత్త శకానికి నాంది పలికిందని మోదీ అన్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా మిజోరాంతో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ఇది ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Published on: Sep 13, 2025 12:01 PM