Perni Nani: ‘నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు’.. పేర్ని నాని భావోద్వేగం
మాజీ మంత్రి పేర్ని నాని టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన "గుండెకాయ లాంటి మనిషి"ని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపితే.. వారికి సానుభూతి వస్తుందని నాకు తెలీదా..? తెలిసి అలాంటి పనులు చేస్తానా అన్నారు.
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి తరతరాలుగా ఎంతో విధేయంగా ఉన్న ఓ వ్యక్తిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మత్స్యకార కుటుంబంలో పుట్టినా, విమర్శలు ఎదుర్కొన్నా, తమతోనే నిలబడిన ఆ మంచి మనిషి హత్య తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు. ఏ రాజకీయ శత్రువునైనా తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెడితే జరిగే పర్యవసానాలు తనకు తెలుసని పేర్కొన్నారు. తాను అలాంటి తప్పు చేయనన్నారు.
చంద్రబాబుపై మీకు సాప్ట్ కార్నర్ ఉందా అని ప్రశ్నించగా… ఒకవేళ తనకు = నిజంగానే అవసరం ఏర్పడితే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి ఇంట్లో పడుకుంటానని, కానీ రాజకీయాల్లో వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదని, ఒక వేశ్య కన్నా ఘోరంగా బతకాల్సిన అవసరం లేదని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
