ఇది కదా రక్త సంబంధం అంటే ?? కష్టకాలంలో వదినకు అండగా మరదలు

Updated on: Feb 01, 2026 | 4:31 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్‌తో కలిసి నిలవడం ప్రజలను ఆకట్టుకుంది. అంత్యక్రియల్లో వారి అనుబంధం 'పవార్ వర్సెస్ పవార్' పోరు చూసిన వారికి భావోద్వేగ క్షణాలను మిగిల్చింది. సుప్రియా మరణించిన భర్త పక్కనే ఉన్న సునేత్రకు అండగా నిలబడి కుటుంబ విలువల గొప్పతనాన్ని చాటింది.

ఎన్నికల ప్రచారం కోసం సొంత నియోజకవర్గానికి వెళ్తూ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు. ఈ ఘటనతో రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి, పవార్ కుటుంబంలో ఐక్యత బారామతి ప్రజలను ఆకట్టుకుంది. ఎన్నికల్లో ‘పవార్ వర్సెస్ పవార్’ పోరాటాలు చూసిన ప్రజలకి, ఇప్పుడు సుప్రియా సూలే తన వదిన సునేత్ర పవార్‌తో కలిసి అండగా నిలవడం ఆకట్టుకుంటోంది. అంత్యక్రియల్లోనూ వారిద్దరి మధ్య కనిపించిన అనుబంధం చూసి ఇది కదా రక్త సంబంధం అంటే అంటున్నారు. అజిత్ పవార్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్‌ వెన్నంటే ఉన్నారు. తన భర్త మృతదేహాన్ని తీసుకుని బారామతికి వచ్చినప్పుడు, ఆమె ఒంటరిగా రాలేదు. మరదలు సుప్రియా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, జనాల మధ్య, కెమెరాల మధ్య నడిపించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపినప్పుడు సుప్రియా తన వదినకు అండగా నిలిచి, ఆమెకు ధైర్యం చెప్పారు. అజిత్ పవార్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు ఆ దృశ్యం చాలా భావోద్వేగానికి గురిచేసింది. కుటుంబ సభ్యులను, జనసందోహాన్ని సుప్రియా సమన్వయం చేస్తూ, వేదికపై నుంచి ప్రకటనలు కూడా చేశారు. మన ‘దాదా’ అజిత్ పవార్ ఎప్పుడూ పాటించే క్రమశిక్షణను పాటించాలని ఆమె భారీ జనసమూహాన్ని కోరారు. గురువారం జరిగిన అంత్యక్రియల్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ పోటీ పడిన రాజకీయ వైరం ఎక్కడా కనిపించలేదు. పూజారులు మతపరమైన ‘విధి’ (సంప్రదాయాలు) నిర్వహించడానికి సునేత్రను పిలిచినప్పుడు, సుప్రియా ఆమెను దగ్గరగా పట్టుకుని, ప్రతి అడుగులోనూ మార్గనిర్దేశం చేశారు. అంత్యక్రియల సమయంలో సునేత్ర పూజ తాంబూలం పళ్లెం పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చేతులు దుఃఖంతో వణికిపోయాయి. అప్పుడు కూడా సుప్రియా ఆ తాంబూలాన్ని పట్టుకుని, సునేత్రతో పూజ చేయించారు. అంత్యక్రియల్లో భాగంగా చితి చుట్టూ సునేత్రా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు సైతం సుప్రియా ఆమెతోనే ప్రతి క్షణం నడిచారు. మెట్లు ఎక్కడంలో, దిగడంలో సహాయం చేస్తూ, ఆమె చేతిని ఒక్క క్షణం కూడా వదలకుండా తోడుగా నిలిచారు. ఏడాది కిందట లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా, సునేత్రను రికార్డు మెజారిటీతో ఓడించిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అజిత్ పవార్ తన మేనల్లుడు యుగేంద్రను ఎదుర్కొన్నారు. మూడేళ్ల కిందట బాబాయి శరద్‌పవార్‌ నాయకత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీని అజిత్ పవార్ చీల్చి బీజేపీతో చేతులు కలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు