పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ సిబ్బంది..
పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. రూప రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించటం గమనించిన కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేశారు..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. రూప రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించటం గమనించిన కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేశారు.. ప్రమాదం, జరిగిన సష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, కొన్ని నెలల క్రితం పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదం గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. అప్పటి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందిన విషయం తలచుకుని భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 02, 2025 09:52 PM