రైతును నిలువునా ముంచేసిన సైబర్ నేరగాళ్లు!
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలానికి చెందిన రైతు బోనం కోటేశ్వరరావు సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.16.82 లక్షలు కోల్పోయాడు. పంటలు అమ్మగా వచ్చిన డబ్బును రెండు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న ఆయనకు వాట్సాప్‌లో వచ్చిన లింక్ పంపారు. దాన్ని తెరవడంతో ఫోన్ హ్యాక్ అయిందని, బ్యాంకు సందేశాలు రాకుండా చేసి నేరగాళ్లు విడతలవారీగా నగదును కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుని అక్కరకు వస్తుందని దాచుకున్న డబ్బులను సైబర్ కేటుగాళ్లు క్షణాల్లో కాజేసి ఆ రైతును రోడ్డున పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ రైతు సైబర్ నేరగాళ్ల బారిన పడి భారీ మొత్తాన్ని కోల్పోయాడు. బ్రాహ్మణపల్లికి చెందిన రైతు బోనం కోటేశ్వరరావు ఇటీవలే తాను పండించిన మిరప, కందులు, పత్తిని విక్రయించగా వచ్చిన రూ. 16,82,875 నగదును చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఖాతాల్లో దాచుకున్నాడు. రైతు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు వ్యూహాత్మకంగా ఆయన వాట్సాప్‌కు ఒక లింక్ పంపారు. ఆ లింక్‌ను కోటేశ్వరరావు ఓపెన్ చేయగానే ఆయన ఫోన్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లు రాకుండా ఫోన్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఖాతాలోని డబ్బును డ్రా చేశారు. చైతన్య గోదావరి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బునంతటినీ పూర్తిగా ఖాళీ చేయగా, యూనియన్ బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 450 మాత్రమే మిగిల్చారు. కొద్ది రోజుల తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఖాతా ఖాళీగా ఉండటం చూసి కోటేశ్వరరావు కంగుతిన్నాడు. స్థానికుల సలహాతో వెంటనే బ్యాంకు అధికారులను ఆశ్రయించగా, వారు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా మోసగాళ్ల పాలవడంతో తన డబ్బు తనకు ఇప్పించాలని ఆ రైతు వాపోతున్నాడు. అపరిచితులు పంపే లింక్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. తాజ్ హోటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా!
వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.1500కే ఏడాది ఫాస్టాగ్ పాస్.. టోల్ ప్లాజా బాదుడుకు చెక్
త్వరలో కొత్తగా రూ.1,000 నోటు? అధికారుల క్లారిటీ
వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్.. భారీగా పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ఛార్జీలు
