Oral Cancer Awareness Run: ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్.. లైవ్ వీడియో

Updated on: Apr 20, 2025 | 9:03 AM

Oral Cancer Awareness Run: ఈ పరుగు మనకోసం..! అవును.. ఓరల్‌ క్యాన్సర్‌ను ఎదుర్కోవాల్సిన సమయం ఇది..! సమాజంలో పెరుగుతున్న ఓరల్‌ క్యాన్సర్‌ కేసులను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రమాదకారిగా మారుతున్న ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో మారథాన్ నిర్వహించింది. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. టీ-వర్క్స్‌ నుంచి మైహోమ్ భూజ మీదుగా ఐటీసీ వరకు 5K, 10K, 2.5K రన్స్‌ కొనసాగుతున్నాయి.

Oral Cancer Awareness Run: ఈ పరుగు మనకోసం..! అవును.. ఓరల్‌ క్యాన్సర్‌ను ఎదుర్కోవాల్సిన సమయం ఇది..! సమాజంలో పెరుగుతున్న ఓరల్‌ క్యాన్సర్‌ కేసులను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రమాదకారిగా మారుతున్న ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో భారీ మారథాన్ జరిగింది. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీ-వర్క్స్‌ నుంచి మైహోమ్ భూజ మీదుగా ఐటీసీ వరకు 5K, 10K, 2.5K రన్స్‌ కొనసాగాయి. గ్లోబల్‌ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, యశోద హాస్పిటల్ ఎండీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు..

ప్రముఖ వైద్యులతో పాటు జనం కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కల్గించేందుకు ఈ రన్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. డ్రగ్స్, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్‌లకు దూరంగా ఉండాలని ఈ సందర్బంగా వైద్యులు పిలుపునిచ్చారు.

Published on: Apr 20, 2025 08:17 AM