ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??

|

Nov 05, 2023 | 9:47 PM

తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు నీట మునిగాయి. చెన్నై, చెంగల్‌పట్టు, మధురై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి నీలగిరి జిల్లాలో చెట్లు విరిగి పడ్డాయి. ఊటి వెళ్లే రైల్వే ట్రాక్‌పై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు నీట మునిగాయి. చెన్నై, చెంగల్‌పట్టు, మధురై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి నీలగిరి జిల్లాలో చెట్లు విరిగి పడ్డాయి. ఊటి వెళ్లే రైల్వే ట్రాక్‌పై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ టీం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఊరీ వెళ్లే రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో 8 జిల్లాలలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. తేనీ జిల్లాలో జలపాతాలు మూసివేశారు. మరో రెండు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలు కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..

బస్సు బీభత్స ఘటనలో ఒకరు దుర్మరణం.. కారు, బైకులు ధ్వంసం