Srikakulam: ఒడిశా స్టేట్ SI ఎగ్జామ్ పేపర్ లీక్ గుట్టు రట్టు
ఒడిశా స్టేట్ ఎస్సై పరీక్ష పేపర్ లీక్ రాకెట్‌ను శ్రీకాకుళం పోలీసులు ఛేదించారు. 117 మంది అభ్యర్థులు, ముగ్గురు ఏజెంట్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఒడిశా పోలీసుల సమాచారంతో శ్రీకాకుళం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించి, నిందితులను అరెస్ట్ చేశారు.
ఒడిశా స్టేట్ ఎస్సై పరీక్ష పేపర్ లీక్ రాకెట్‌ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారంలో మొత్తం 117 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా, ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి విజయనగరం వెళ్తున్న మూడు బస్సులను ఎచ్చర్ల వద్ద శ్రీకాకుళం డీఎస్పీ బృందం సోదాలు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకుంది. లీకైన పరీక్ష పేపర్ కోసం బయలుదేరిన 114 మంది అభ్యర్థులు ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. పేపర్ లీక్ చేసిన ఏజెంట్లు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
