మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్

Updated on: Nov 08, 2025 | 8:48 AM

తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒడిశాకు చెంది ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటన పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో జరిగింది. విశాఖ నుంచి జైపూర్‌ వెళ్తోన్న ఒడిశా ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఇంజిన్‌లో పొగలు చూసిన డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, బస్సులోని ఐదుగురు ప్రయాణికులను దింపేశాడు. ఈ క్రమంలో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించటంతో వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలార్పారు. అయితే బస్సు అప్పటికే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని ఆమె ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదం గురించి తెలుసుకొని మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులతో మాట్లాడి వివారలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ, ఆర్టీసీ సంయుక్తంగా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??

గగనయాన్‌ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??

నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు