మరో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నలుగురికి తీవ్రగాయాలు

Updated on: Nov 19, 2025 | 12:30 PM

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఓవర్‌టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతంలో కర్నూలు, చేవెళ్లలో జరిగిన ప్రమాదాల తర్వాత రోడ్డు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం మరువకముందే.. పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరగుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఏపీలోని ఎన్డీఆర్ జిల్లాలో K.కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ వెళ్తున్న క్రమంలో.. K.కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొంది.. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరి కొందరికి స్వల్పగాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఓవర్ టేక్ చేసే క్రమంలో కావేరి ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ బస్సు, లారీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వస్తున్నాయని, ముందువెళ్లే లారీని బస్సు వెనకనుంచి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.బస్సు వేగంతో లారీని ఢీకొట్టడంతో.. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలి చంపేస్తున్న వేళ.. వాతావరణశాఖ భారీ వర్షాల అలర్ట్‌

మాటలకందని మహా విషాదం.. ఒకే కుటుంబంలో 3 తరాలను తుడిచేసిన ప్రమాదం