బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు.. వీడియో చూసేయండి..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ముంబై-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చారు నీతా అంబానీ. బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ముంబై-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చారు నీతా అంబానీ. బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో ఉన్న నీతా అంబానీ.. అద్దాల మండపాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్న ప్రతీ సందర్బంలో నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు. అందులో భాగంగానే ఈసారి కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని నీతా సందర్శించారు. ఆలయ ఈఓ కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిబాబాగౌడ్ నీతా అంబానీకి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నీతా అంబానీకి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది.