రాత్రి గోళ్లు కట్ చేయకూడదు.. చాదస్తం కాదు ..సైంటిఫిక్ రీజన్ ఉంది

Updated on: Dec 08, 2025 | 12:50 PM

రాత్రి పూట గోర్లు కత్తిరించకూడదని పెద్దలు చెబుతారు. దీని వెనుక పౌరాణిక నమ్మకాలు (నకారాత్మక శక్తి) ఉన్నప్పటికీ, అనేక ఆచరణాత్మక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అప్పట్లో తక్కువ వెలుతురులో గాయాలు, గోళ్లలో ఇరుక్కున్న బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటం వంటివి ముఖ్యమైనవి. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు, తగిన వెలుతురులో గోర్లు కత్తిరించడం శ్రేయస్కరం.

ఇంట్లో రాత్రి పూట గోర్లు కట్ చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా. పొరపాటున ఆ ప్రయత్నం చేశారంటే చివాట్లు తప్పవు. రాత్రి పూట గోర్లు కత్తిరించుకుంటావా అని గట్టిగా వారిస్తారు ఇంట్లో వాళ్లు. అలా తిట్టడం మొదలు పెట్టగానే మనకు చిరాకు అనిపిస్తుంది. ఏంటీ చాదస్తం అని విసుక్కుంటాం. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజనింగ్‌ వివరిస్తే చాలా వరకూ ఈ అలవాటు మానుకోడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ పెద్దలు ఈ నియమాన్ని పెట్టడానికి కారణమేంటి. ముందుగా హిందూ మైథాలజీ ప్రకారం చూసుకుంటే రాత్రి పూట నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఆ సమయంలో మన శరీరంలో ఎలాంటి మార్పు జరిగినా వెంటనే ఆ నెగటివ్ ఎనర్జీని బాడీ అట్రాక్ట్ చేస్తుందని చెబుతారు. మైథాలజీ రీజన్స్ గురించి చెప్పుకున్నాం. వీటిని నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం. కానీ..దీని వెనకాల కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిని మాత్రం నమ్మక తప్పదు. సాధారణంగా రోజంతా మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. చాలా చోట్ల పనులు చేస్తాం. చేతులపై రకరకాల దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. గోళ్లలో అవి ఇరుక్కుని ఉంటాయి. ఆ సమయంలో ఎలా పడితే అలా గోళ్లు కత్తిరించుకుంటే ఆ బ్యాక్టీరియా అంతా వ్యాప్తి చెందుతుంది. మూతి, ముక్కుపై ఆ వేళ్లు పెట్టుకుంటే అక్కడ కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు గోళ్లు తీసుకుంటే ఎలాంటి హానీ ఉండదు. ఇప్పుడంటో మనకు అని రకాల లైట్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు ఇవేమీ లేవు. దీపాలు పెట్టుకుని రాత్రంతా పడుకునే వాళ్లు. ఆ చీకట్లో గోళ్లు కట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే పొరపాటున వేళ్లు కట్ అయ్యే ప్రమాదముంటుంది. అందుకే అప్పట్లో ఈ రూల్ తీసుకొచ్చారు. పైగా సాయంత్రం అయ్యే సరికి బాడీ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. అలాంటి మెటబాలిజం అలవాటైపోయింది. అప్పుడు గోళ్లు కత్తిరించడం లాంటి పనులు పెట్టుకుంటే అనవసరంగా ఈ రిలాక్సేషన్ కి అడ్డు వస్తుంది. బహుశా రాత్రి పూట గోళ్లు కట్ చేసుకోవద్దు అని చెప్పడానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల

24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం

ఈ ఆకులను చీప్‌గా చూడొద్దు.. ఆ వ్యాధికి దివ్య ఔషధం..

జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో

ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు