News9 Global Summit: ఇండో-జర్మన్ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం: ప్రధాని మోదీ
టీవీ9 నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. జర్మనీలో దాదాపు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గడిచిన కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య వ్యాపారం బలపడుతోందన్నారు.
టీవీ9 నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండో-జర్మన్ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.
టీవీ9 ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమన్నారు. భారత్‌కు ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి అని ప్రధాని చెప్పారు. రానున్న కాలంలో భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. నేడు ప్రపంచంలోని ప్రతి దేశం భారత్‌తో అభివృద్ధి భాగస్వామ్యం కలిగి ఉండాలని కోరుకుంటోందని మోదీ వ్యాఖ్యానించారు.
మరిన్ని న్యూస్ 9 గ్లోబల్ సమిట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Nov 22, 2024 09:33 PM