Nepal earthquake: నేపాల్‌ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి

|

Nov 04, 2023 | 8:26 PM

నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది.

నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు, భవంతులు కుప్పకూలిపోయాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం

లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరో కూతురు !! ధర రూ. 15.75 కోట్లపై మాటే

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణపై ఇర్ఫాన్‌ పఠాన్‌ రియాక్షన్..