Nellore: కారం బస్తా చిరిగి నడిరోడ్డుపై పడింది.. ఆ తర్వాత..

Updated on: Sep 10, 2025 | 1:59 PM

నెల్లూరు జిల్లాలోని టపాతోపులో కారం బస్తా చిరిగిపడి రోడ్డంతా ఎర్రగా మారింది. గాలికి ఎగిరిన కారం వాహనదారుల కళ్లలోకి చేరి కళ్ల మంటలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీకి జేసీబీ తగలడంతో జరిగిన ఈ ఘటన ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. రోడ్డుపై నీళ్లు పోసి శుభ్రం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని టపాతోపులో నడిరోడ్డుపై కారం బస్తా చిరిగి కలకలం రేపింది. కారం లోడ్‌ చేసిన లారీకి ఎదురుగా వచ్చిన జేసీబీ తగలడంతో బస్తా పగిలిపోయింది. రోడ్డంతా కారం చిందర వందరగా పడిపోయి గాలికి ఎగిరి వాహనదారుల కళ్లలోకి చేరింది. దీంతో కళ్ల మంటలతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై నీళ్లు పోసి కారం శుభ్రం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Published on: Sep 10, 2025 01:59 PM