నానమ్మను చూసేందుకు వచ్చి కానరాని లోకాలకు

Updated on: Jan 27, 2026 | 4:55 PM

నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నానమ్మను చూడటానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో బంతి తీయబోయి ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలు నింపింది. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నానమ్మ అనారోగ్యంగా ఉందని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లిని చూసేందుకు కుటుంబంతో సహా ఆదివారం స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్దకు పిల్లలతో సహా వెళ్లారు. వారితో పాటు శ్రీకాంత్ రెడ్డి అక్క కుటుంబం సైతం అక్కడికి వచ్చారు. పెద్దలు పొలాలను పరిశీలిస్తూ మాట్లాడుకుంటుండగా పిల్లలు అందరూ అక్కడే బంతితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బంతి వ్యవసాయం కోసం తీసిన నీటి గుంతో పడిపోయింది. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చేందుకు ముగ్గురు చిన్నారులు శ్రీమాన్య రెడ్డి, శ్రీకృతి , స్నేహ, విద్యాధరణి రెడ్డి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నలుగురు నీటి గుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు కేకలు విని కుటుంబ సభ్యులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు. విద్యాధరణి రెడ్డిని సురక్షితంగా కాపాడగా మిగతా ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పిల్లలు చనిపోగా, అక్క కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల మరణ వార్తతో ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

కాశీ విశ్వనాధ్‌ ఆలయంలో రిపబ్లిక్‌ డే శోభ

దేశభక్తికి మాటలతో పనేముంది ?? సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు