నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే

Updated on: Jul 25, 2025 | 12:38 PM

ఉదయం బాగుంటే.. ఆ రోజంతా హరివిల్లులా ఉంటుంది. అవును.. రోజంతా ఎలా ఉంటుందనేది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజు సానుకూలతతో ప్రారంభమైతే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుందని వారు చెబుతున్నారు. నేటి జీవనశైలి కారణంగా మన ఉదయపు అలవాట్లతో కొన్నిసార్లు రోజంతా అప్‌సెట్‌ అవుతుంటుంది.

అందుకే.. రోజు సానుకూలంగా ప్రారంభంకావాలంటే ఈ కింది అలవాట్లను వదులుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే చాలామందికి ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మీ మెదడుపై భారాన్ని పెంచుతుంది. దీనివల్ల పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మరో విషయం ఏమిటంటే.. ఉదయం మొబైల్ లో చూసే చెడు వార్తల ప్రభావం రోజంతా పడుతుంది. చాలా మంది కాలేజీకి లేదంటే ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఆలస్యం అవుతుందని బ్రేక్‌ ఫాస్ట్ మానేస్తుంటారు. ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం. ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. చాలా మందికి ఉదయం నిద్రలేచిన తర్వాత మంచం మీద కూర్చుని తమ వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది. ఇది మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. కాబట్టి రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్‌

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా.? అయితే.. రిస్కే

తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది

‘సూపర్ హిట్‌’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్‌ వైరల్ ట్వీట్‌!

మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా