Telangana: BRSలో కవిత కల్లోలంపై టీవీ9 మురళీకృష్ణ విశ్లేషణ..

Updated on: Sep 01, 2025 | 6:03 PM

ఇది కంచికి చేరని కవిత కథ. గులాబీతోటలో కల్లోలం సృష్టిస్తున్న కవిత వ్యథ. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుపై అసెంబ్లీలో లేటెస్టుగా జరిగిన రచ్చ ఒకెత్తయితే... అంతకు వెయ్యింతల డోస్‌తో వచ్చిన సునామీ ఇది. మరోసారి సంచలన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ రాజకీయాల్లో కలంకలం సృష్టించారు.

అలాఇలా కాదు.. ఈసారి ఏకంగా పేర్లు మెన్షన్‌ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు.. అగ్నిపర్వతాన్ని బద్ధలు కొట్టేశాయి. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో… ఒక్కసారిగా భగ్గుమన్నారు కవిత. కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఆదేశిస్తారా? కడుపు రగిలిపోతోందంటూ… కంటనీరు పెట్టుకున్న కవిత… బీఆర్‌ఎస్‌ కీలకనేతలపై చేసిన ఆరోపణలు రచ్చరేపుతున్నాయి. అంతా హరీష్‌రావు, సంతోష్‌రావులే చేశారనీ… దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో కేసీఆర్‌ చుట్టూ కొందరంటూ పేర్లు మెన్షన్‌ చేయని కవిత… ఇప్పుడు పేర్లుపెట్టి మరీ ఆరోపణలు గుప్పించడం గులాబీవర్గాలను షాక్‌కి గురిచేస్తున్నాయ్‌.