చెడ్డీ గ్యాంగ్‌ కాదు.. అంతకు మించి.. ముసుగు దొంగలు బాబోయ్‌

Updated on: Jan 01, 2026 | 5:23 PM

తెల్లవారుజామున నిద్రలో ఉండగా కాకినాడ జిల్లాలో ముసుగు దొంగలు రెచ్చిపోతున్నారు. కత్తిపూడిలో Samsung షోరూం నుండి రూ.30 వేల నగదు, 12 ఫోన్‌లు, బైక్ దొంగిలించారు. దుకాణాలు, పొలాల్లో చోరీలకు విఫలయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు రాత్రి గస్తీ పెంపు కోరుతున్నారు. ఈ కొత్త ముసుగు దొంగల గ్యాంగ్‌తో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

చెడ్డీ గ్యాంగ్‌, చైన్‌ స్నాచర్స్ ఇలా రకరకాల దొంగలు చోరీలకు పాల్పడటం చూశాం. ఇప్పుడు ముసుగు దొంగలు రంగంలోకి దిగారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా ముసుగులు ధరించి చోరీలకు పాల్పడుతున్నారు. అదీ, ఇదీ కాదు ఇళ్లు, దుకాణాలు, పొలాలు ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే అది దోచుకుపోతున్నారు. తాజాగా కాకినాడలో ఈ ముసుగు దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామును ఏకంగా మూడుచోట్ల చోరీలకు పాల్పడ్డారు. కాకినాడ జిల్లాలో ముఖ్య కూడలైన కత్తిపూడిలో నిత్యం దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ చోరీ జరుగుతూనే ఉంది. ముసుగులు ధరించిన కొందరు దొంగలు సోమవారం తెల్లవారుజామున రెండుచోట్ల చోరీలకు పాల్పడగా మరో మూడోచోట చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… కత్తిపూడి 16వ జాతీయర హదారి సర్వీసు రోడ్డును ఆనుకుని ఉన్న సామ్ సంగ్ మొబైల్ షోరూం లో 30 వేల నగదు, రూ.2 లక్షలకు పైగా విలువ చేసే 12 ఫోన్లతోపాటు, నెల్లిపూడి శ్రీను అనే వ్యక్తికి చెందిన బైకును ఎత్తుకుపోయారు. తులసీ విత్తనాల షాపు, రహదారికి ఆనుకుని ఉన్నపొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ సీసీ ఫుటేజీ ఆధారంగా ఆధారాలను సేకరించినట్టు అన్నవరం ఎస్ఐ. తెలిపారు. ముఖ్యకూడలి కావడంతో మరింత గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. తెల్లవారు జామున వాహనాలు తిరుగుతున్న సమయంలోనే దర్జాగా మొహాలకు మాస్కులు ధరించి దోపిడీకి పాల్పడ్డారని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు