బీజేపీ నేత మురళీధర్ రావు కూతురు.. అనన్య కూచిపూడి రంగప్రవేశం..

Updated on: Aug 31, 2025 | 8:41 AM

కంప్యూటర్ కాలం, 5జీ యుగంలోనూ మన కళలు, సంప్రదాయాలను కాపాడుతున్నారు నేటి తరం యువత. వెస్ట్రన్ కల్చర్‌లోనూ.. కూచిపూడి లాంటి పురాతన నాట్యంలో ప్రావీణ్యం సాధించారు అనన్య పోల్సని. ఆమె కూచిపూడి అరంగేట్రం గ్రాండ్‌గా జరిగింది. అనన్య.. అభినయ దర్శన ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు, కళారత్న శ్రీమతి ఓలేటి రంగమని దగ్గర నాట్యం నేర్చుకున్నారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలో బీజేపీ నేత మురళీధర్ రావు కూతురు అనన్య పోల్సని కూచిపూడి రంగ ప్రవేశం చేశారు. అభినయ దర్శన ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు, కళారత్న శ్రీమతి ఓలేటి రంగమని దగ్గర నాట్యం నేర్చుకున్నారు. UKలో LLB చదువుతున్న యువ నర్తకి అనన్య తొలి సోలో ప్రదర్శన ఇచ్చారు. యువ కళాకారిణి అనన్య 2019లో ప్రవాసి భారతీయ దివాస్‌తో పాటు పలు విశిష్ట సాంస్కృతి కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. స్కూల్ నుంచే జాతీయస్థాయిలో నృత్యంలో ప్రాతినిధ్యం వహించారు. న్యూఢిల్లీలో డాన్స్ ఇండియా మ్యాగ్జిన్ వారి యంగ్ అచీవర్ టైటిల్ పొందారు. గణపతి కీర్తన, భామ కలాపం, జావలి, తిల్లానా, సింహనందిని ఆమె ప్రతిభకు అద్దం పట్టాయి. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, పద్మభూషణ్ డాక్టర్ రాజా రాధా రెడ్డి, శాంతా బయోటెక్ చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, పద్మ శ్రీ డాక్టర్ శోభరాజు అనన్యని ఆశీర్వదించారు. మన కళలను తర్వాతి తరానికి అందించేలా నేటి యువత ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Published on: Aug 31, 2025 08:22 AM