స్వీట్‌ షాపులో కరకరలాడే మిక్చర్‌ తింటున్నారా.. జాగ్రత్త!

Updated on: Jul 05, 2026 | 4:30 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ స్వీట్ షాపులో కొనుగోలు చేసిన ఖారా మిక్చర్‌లో వేగిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తింటుండగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో వినియోగదారుడు యాజమాన్యాన్ని నిలదీశారు. ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతుండగా, అధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నిసార్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినా, ఫైన్లు విధించినా వ్యాపారుల తీరు మారడం లేదు. ఆహారంలో ఎప్పుడూ ఏవొక కీటకాలు కనిపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ రోడ్‌ సైడ్‌ టిఫిన్‌ సెంటర్లో వడతోపాటు వేగిపోయిన బల్లి వచ్చింది. దాంతో ఆ వడలు తిన్న కుటుంబ సభ్యులు వాంతులు చేసుకొని నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ స్వీటు షాపులో కొన్న మిక్చర్‌లో వేగిపోయిన బల్లి వచ్చింది. వరుస ఘటనలతో ఆహారభద్రత ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. రాజన్న సిరిసిల్లజిల్లా కేంద్రంలో ఆహార భద్రత నిబంధనలు గాల్లో దీపాల్లా మారాయి. పట్టణంలోని ప్రసిద్ధ ‘శ్రీ బాలాజీ స్వీట్ హౌస్’లో కొనుగోలు చేసిన ఖారా మిక్చర్‌లో నూనెలో వేయించిన బల్లి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు సదరు స్వీట్ హౌస్‌లో మిక్చర్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులంతా కలిసి దానిని తింటుండగా, లోపల నూనెలో వేగిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆందోళనతో వెంటనే సదరు స్వీట్ హౌస్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీయగా.. నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పట్టణం అంతా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సదరు స్వీట్ హౌస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్‌ చివరి లెటర్

అసభ్యకరంగా బ్యాక్‌ షాట్ తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నం అరిచిన హీరోయిన్ !

Rahul Ravindran: పిల్లలను చంపేస్తామనే బెదిరింపులు.. ‘ఎక్స్‌’ నుంచి తప్పుకున్న డైరెక్టర్

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

Follow Us