Liquor Bottles: ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది

| Edited By: Subhash Goud

Jun 15, 2024 | 7:59 PM

ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకుంటున్నారు పోలీసులు. ఎక్సైజ్‌ పన్నులు చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎక్సైజ్‌ శాఖతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమంగా పట్టుబడ్డ మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు పోలీసులు. రంగారెడ్డి ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ పరిధి, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో..

ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకుంటున్నారు పోలీసులు. ఎక్సైజ్‌ పన్నులు చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎక్సైజ్‌ శాఖతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమంగా పట్టుబడ్డ మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు పోలీసులు. రంగారెడ్డి ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ పరిధి, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌గా పట్టుబడిన మద్యం బాటిళ్లను డిప్యూటి కమిషనర్‌ ధశరధ్‌, ఇతర అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు.

గోవా, హర్యానా, ఢిల్లీతో సహ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్సైజ్‌ పన్నులు చెల్లించకుండా తెలంగాణకు బస్సులు, విమానాలు, ఇతర రవాణా మార్గాల్లో అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ మద్యాన్ని చాలా కాలం పాటు పోలీసు స్టేషన్‌లలో నిల్వ ఉంచడగా, వాటిని ఇప్పుడు ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్లను ఉన్నతాధికారులు అనుమతితో రంగారెడ్డి డిప్యూటి కమిషనర్‌ దాశరథ్‌ ఇతర ఎక్సైజ్‌ అధికారుల సమక్షంలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలో ధ్వంసం చేశారు. వివిధ పోలీస్‌ స్టేషన్లలో 686 కేసుల్లో పట్టుబడిన మద్యం సుమారు 10,222 లీటర్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. రోలర్‌ సహాయంతో ఈ బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ. 1,83,42,763 ఉంటుందని డిప్యూటి కమిషనర్‌ దశరధ్‌ తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో తక్కవ ధరల్లో మద్యాన్ని తీసుకువస్తున్న కొందరు తెలంగాణలో అధిక ధరతకు అమ్ముతున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న మద్యంపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. ఇలా అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడితే కేసులతో పాటు జైలుపాలు కావాల్సి వస్తుంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow us on