రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు

Updated on: Dec 08, 2025 | 11:41 AM

ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవితంలో నవ్వడం ఆరోగ్యానికి ఒక వరం. రోజుకు కనీసం 15 నిమిషాలు నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సైన్స్, ఆయుర్వేదం రెండూ నవ్వును సహజ ఔషధంగా పరిగణిస్తాయి, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, దీర్ఘాయువును ప్రోత్సహిస్తాయి. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం నవ్వు యోగా, కుటుంబంతో గడపడం వంటివి అలవర్చుకోండి.

రోజంతా ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న ప్రస్తుత కాలంలో నవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రోజుకు కనీసం 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల శరీరానికి రెండు గంటల నిద్ర ఇచ్చినంత ప్రయోజనం కలుగుతుంది. నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనకు చాలా మంది చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల మనసు సంతోషంగా ఉండటమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆయుర్దాయం పెరుగుతుందని మీరూ వినే ఉంటాం. కానీ ఇది నిజమా అంటే అవుననే అంటున్నారు. నవ్వు కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి ఒక టానిక్ వంటిదని నిపుణులు చెబుతున్నారు. సైన్స్, ఆయుర్వేదం రెండూ కూడా ఇదే చెబుతున్నాయి. రోజూ నవ్వడం వల్ల మన ఒత్తిడి తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని, ఆయుష్షు కూడా పెరుగుతుందని అంటున్నారు. నవ్వు ఒక సహజ ఔషధం కంటే తక్కువ కాదని ఆధునిక శాస్త్రం నమ్ముతుంది. మీరు నవ్వినప్పుడు, మీ మెదడు ఎండార్ఫిన్లు, డోపమైన్‌లను విడుదల చేస్తుంది, ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. నవ్వడం వల్ల మన రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ 10-15 నిమిషాలు నవ్వడం తేలికపాటి వ్యాయామం చేసినంత ప్రయోజనకరంగా ఉంటుంది. నవ్వు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో నవ్వును శరీరం, మనస్సు సమతుల్యతను కాపాడే సహజ ఔషధం అంటారు. నవ్వడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, నిద్ర కూడా మెరుగుపడుతుంది. సంతోషంగా ఉండటం, నవ్వడం వల్ల మీ ఆయుష్షు నేరుగా పెరుగుతుందని ఆయుర్వేదం నమ్ముతుంది. అందుకే యోగా, ధ్యానంతో పాటు, నవ్వును దీర్ఘాయువులో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. మీ ఉదయాన్ని నవ్వుల యోగాతో ప్రారంభించండి. కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి, ఆ సమయంలో బిగ్గరగా నవ్వండి. కామెడీ షోలు చూడండి, ఫన్నీ పుస్తకాలు చదవండి లేదా పిల్లలతో ఆడుకోండి . ఈ చిన్న చిన్న ఆనందాలు, పెద్ద నవ్వులు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనస్సును ఇవ్వడమే కాకుండా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??