మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్‌

|

Jan 12, 2024 | 9:44 PM

లక్షద్వీప్‌ దశ తిరగనుందా? మాల్దీవులకు దీటుగా పర్యాటక స్వర్గధామంగా మారనుందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత ఆ ప్రాంతం కొత్త రూపును సంతరించుకుంటోంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. విమానాశ్రయాల విస్తరణ, హోటళ్ల నిర్మాణం ఊపందుకుంది. మినికాయ్ ద్వీపం వద్ద ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా విస్తరిస్తున్నారు.

లక్షద్వీప్‌ దశ తిరగనుందా? మాల్దీవులకు దీటుగా పర్యాటక స్వర్గధామంగా మారనుందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత ఆ ప్రాంతం కొత్త రూపును సంతరించుకుంటోంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. విమానాశ్రయాల విస్తరణ, హోటళ్ల నిర్మాణం ఊపందుకుంది. మినికాయ్ ద్వీపం వద్ద ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా విస్తరిస్తున్నారు. ఎయిర్ బస్ లాంటి భారీ విమానం ల్యాండ్ అయ్యేలా నిర్మాణం చేపడుతున్నారు. మరో విశేషం ఏంటంటే మినికాయ్ ద్వీపం మాల్దీవులకు దగ్గరగా ఉంటుంది. అగట్టి దీవుల్లో చిన్న ఎయిర్ పోర్టు ఉంది. దాని విస్తరణను కూడా చేపట్టారు. ఎయిర్ పోర్టు విస్తరిస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్‌ ధర.. ఎందుకంటే ??

గదిలో దగ్గుమందు.. ఓవర్‌డోస్‌ ఇచ్చి చంపిందా ??

అయోధ్య రామయ్యకు భక్తితో బంగారు పాదుకలు..

ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. గదిలోనే సమాధి

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

Follow us on