అదృష్టమంటే ఇదే.. ఒకేసారి 8 వజ్రాలు దొరికాయ్‌ వీడియో

Updated on: Jul 30, 2025 | 3:26 PM

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కూటికి లేన వాడికీ అదృష్టం పడితే.. తెల్లారేసరికి కోటీశ్వరుడై పోతాడనే మాటను నిజం చేసే ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పన్నాలోని వజ్రాల గనిలో దినసరి కూలీకి ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్నాళ్లకు భగవంతుడు తమపై దయ చూపించాడంటూ అతడు సంతోషం వ్యక్తం చేశాడు.

దంపతులకు చివరికి అదృష్టం తలుపుతట్టింది. ఒకేసారి 8 వజ్రాలు లభించాయి. అందులో కొన్నీ ముడి వజ్రాలు కాగా, మరికొన్ని శుద్ధమైనవే. వీటి విలువ రూ.10 – 12 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వజ్రాలను పన్నాలోని వజ్రాల మ్యూజియానికి చేర్చి, అక్కడి నిపుణులు వాటి విలువను అంచనా వేశాక.. వాటిని వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన మొత్తం నుంచి టాక్సులు పోగా మిగిలిన డబ్బును గోవింద్ కుటుంబానికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా హ‌ర్‌గోవింద్ మాట్లాడుతూ…‘భ‌గ‌వంతుడు ఈసారి మ‌మ్మల్ని క‌నిక‌రించాడు. గ‌తంలో ఓసారి ఒక వ‌జ్రం దొరికితే.. తెలియ‌క ల‌క్షకే అమ్మాను. ఈసారి ఆ తప్పు చేయను’అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో




Published on: Jul 30, 2025 03:26 PM