ఒకరి తర్వాత మరొకరు.. పాపం ప్రేమజంట.. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది వీడియో
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి ఒత్తిడితో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, మరుసటి రోజు ప్రియురాలు కూడా ప్రాణాలు తీసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో విడిపోయిన ప్రేమికులు, తిరిగి కలుసుకున్న తర్వాత జరిగిన ఈ ఘటనలో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ధనుంజయ గౌడ్, శశికళ ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరికీ వేరేవారితో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత కొంతకాలానికి, ప్రేమికులిద్దరూ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు.ఇమ్మిగనూరులో మెడికల్ షాప్ నడుపుతున్న ధనుంజయ గౌడ్ తన ప్రియురాలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్చాడు. అయితే, శశికళ హాస్టల్లో ఉండలేనని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాలని ధనుంజయ గౌడ్‌పై ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటంతో, ఒక ఆదివారం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శశికళ బెదిరించింది. మెడకు ఉరి బిగించుకున్నట్లు సెల్ఫీ ఫోటోను ధనుంజయ గౌడ్‌కు పంపింది.
మరిన్ని వీడియోల కోసం :
