Kukatpally: ఆ ప్రాంతంలో 3 రోజులుగా అదే పనిగా సంచరిస్తున్న యువకుడు.. పట్టుకుని ఆరా తీయగా
హైదర్ నగర్ గ్రామంలో సుధీర్ (26) అనే బీటెక్ విద్యార్థి దొంగతనానికి వచ్చి స్థానికుల చేత పట్టుకోబడ్డాడు. 20 లక్షల రూపాయలు బెట్టింగ్‌లొ పోగొట్టుకున్న సుధీర్.. ఆర్థిక సమస్యలతో రెక్కీ నిర్వహించి దొంగతనం చేయడానికి వచ్చాడని తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూకట్‌పల్లి హైదర్ నగర్ ప్రాంతంలో గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి దొంగతనానికి రెడీ అయిన సుధీర్ (26) అనే బీటెక్ విద్యార్థిని స్థానికులు పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా బెట్టింగ్‌లకు అలవాటయి.. 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్న సుధీర్.. అప్పుల నుంచి బయట పడటానికి ఏం చేయాలో అర్థం కాదంటూ దొంగతనం చేయడానికి శ్రమించాడు. అయితే అతగాడి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుధీర్ వద్ద నుంచి సెల్ ఫోన్, కత్తి, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి