కోనసీమలో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు సజీవ దహనం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గణపతి బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
ఆ ప్రాంతమంతా బాంబుల సౌండ్‌తో మోతమోగిపోయింది. పొగ దట్టంగా అలముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. మృతుల్లో ఐదుగుర్ని అధికారులు గుర్తించారు. మంటల్లో బాణాసంచా కేంద్రం యజమాని సత్యనారాయణ కూడా మృతి చెందారు. మరో నలుగురు.. పాకా అరుణ, చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా ఐడెంటిఫై చేయగా.. మరొకర్ని గుర్తించాల్సి ఉంది. అలాగే.. గాయపడ్డవారిలో లింగా వెంకటకృష్ణ అనే వ్యక్తి.. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలాన్నిఅంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ, ఆర్డీవో, ఫైర్ సేఫ్టీ అధికారులతోపాటు.. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. కార్మికులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయవరం పేలుడు ఘటన బాధాకరమన్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్. బాణాసంచా కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. రెండు వారాల క్రితమే తనిఖీలు జరిగాయని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PM Kisan Money: పీఎం కిసాన్ 21వ విడత… మీరు అర్హులా కాదా? ఇలా చెక్ చేసుకోండి
దివాలా తీశాడని భార్య వదిలేసింది.. కట్ చేస్తే
నా భార్య పాము.. రాత్రి కాగానే కాటేస్తోంది
