ఆదరణకు నోచుకోని ఆదుర్రు స్తూపం

Updated on: Oct 16, 2025 | 7:20 PM

ప్రపంచంలోనే 84,000 స్థూపాలలో మూడు దివ్యస్తూపాలు ఉన్నాయి. మూడు దివ్య స్తూపాలలో మొదటి దివ్య ఆదుర్రు ఉండటం కోనసీమ వాసుల అదృష్టం అంటున్నారు గ్రామస్తులు...దేశ విదేశాల నుండి ఎంతోమంది పర్యాటకులు ఆదుర్రు బౌద్ధ స్తూపాన్ని సందర్శించిడానికి వస్తున్న పర్యాటకులకు రోడ్డు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర అవస్తలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.

ఆదుర్రు బౌద్ధ స్తూపానికి సమీపంలో గోదావరి తీరం వెంబడి కోరంగిని మించి ఆహ్లాదకరమైన మడ అడవులు పెరిగాయని ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పర్యాటకులకు ఆహ్లదకారాన్ని ఇస్తుందని స్థానికులు చెబుతున్నారు…ప్రభుత్వాల,నాయకులు మారుతున్నారు తప్ప ఆదుర్రు బౌద్ధ స్తూపాన్ని పట్టించుకునే నాదుడే కొరువయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాలోని మామిడికుదురు మండలంలో బంగాళాఖాతం నుండి 9.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఉపనది అయిన వైనేతయ పశ్చిమ ఒడ్డున ఉన్న 2,400 సంవత్సరాల పురాతన బౌద్ధ ప్రదేశం…. ఈ స్థలాన్ని భారత పురావస్తు సర్వే 1923లో తవ్వి 1955లో రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది. ప్రపంచంలో 84,000 బౌద్ధ స్థూపాలు ఉండగా వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన మూడు బౌద్ధ స్థూపాలు మొదటిది అదుర్రులో, రెండవది రాంచీలో చివరిది సారనాథ్‌లో నిర్మించబడింది. ASI కనుగొన్న చారిత్రక ఆధారాల ప్రకారం, అదుర్రుకు పునాది రాయిని బౌద్ధ సన్యాసిని లేదా… అశోక రాజు కుమార్తె అయిన సంఘమిత్ర శ్రీలంకకు వెళ్లే మార్గంలో వేశారు . అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదురు గ్రామంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావించాలి. ఇక్కడికి దేశ విదేశాల నుండి ఎంతోమంది పర్యాటకులు ఆది బౌద్ధ స్తూపం సందర్శించడానికి వస్తూ ఉంటారు. అయితే ఈ స్థూపాన్ని సందర్శించడానికి సరియైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కాసేపు చేద తీరడానికి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో వచ్చిన పర్యాటకులు విస్మయానికి గురవుతున్నారు.. బొద్దు స్తూపం సమీపంలోని గోదావరి తీరం వెంబడి కోరంగిని మించి ఆహ్లాదకరమైన మడ అడవులు మడ అడవులు చుట్టూ సుందరమైన గోదావరి పాయలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజధానికి 11 కిలోమీటర్లు దూరం ఉన్న ఆదుర్రు బౌద్ధ స్తూపాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుచొరవ చూపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులు తాకిడి ఎక్కువై ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పర్యాటకులకు ఆహ్లదకారాన్ని ఇస్తుందని స్థానికులు చెబుతున్నారు…. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి.. అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి

ఫోటో పెట్టు.. రూ.1000 పట్టు

రూ.18 లక్షల బాహుబలి గుమ్మడి.. బరువు 1064 కేజీలు

భగ్గుమన్న బంగారం-తగ్గిన వెండిగురువారం ధరలు ఎలా ఉన్నాయి

Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్