Wt reducing Injection: బరువు తగ్గించే ఇంజక్షన్ వచ్చింది.. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? (వీడియో)

Updated on: Nov 14, 2021 | 9:32 AM

Wt reducing Injection: స్థూలకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరువు తగ్గించే ఔషధం త్వరలో భారత మార్కెట్‎లోకి రాబోతుంది. ఈ ఔషధం ఇప్పటికే అమెరికాలో విడుదలైంది.


స్థూలకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరువు తగ్గించే ఔషధం త్వరలో భారత మార్కెట్‎లోకి రాబోతుంది. ఈ ఔషధం ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. ‘వీగోవీ’ అనే ఇంజక్షన్ రూపంలో ఈ మందు లభ్యం కానుంది. ‘వీగోవీ’ ఇంజక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ నోవో నార్డిస్ తయారుచేసింది. ఈ మందు తీసుకుంటే 15 శాతం బరువు తగ్గిపోయే అవకాశం ఉందని ఆ కంపెనీ తెలిపింది. వీగోవీ ఇంజక్షన్ జూన్‎లో అమెరికా ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందింది.

బరువు తగ్గించే ఓ మెడిసిన్‌కి అనుమతి లభించడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఈ ఇంజక్షన్ కోసం మెడికల్ షాపులకు అమెరికన్స్ పరుగులు తీస్తున్నారు. అయితే ఈ ఇంజక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బరువు తగ్గాలంటే దీర్ఘకాలం కృషిచేయాలని వివరిస్తున్నారు. వ్యాయామం, కఠిన ఆహారపు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

ఇలాంటివి ఏవి లేకుండా బరువు తగ్గే ఔషధం రావటంతో ఊబకాయుస్థులు బరువు ఎగిరి గంతేస్తున్నారు. అయితే వీగోవీ ఇంజక్షన్ వల్ల దుష్ప్రభావాలు తక్కువేనని ఆ కంపెనీ చెబుతోంది. ఈ ఇంజక్షన్‎తో గత క్వార్టర్ లో కంపెనీ ఆదాయం 41 శాతం పెరిగింది. ఈ మందు తీసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇంజక్షన్‎ను వారానికి ఒక డోసు తీసుకోవాలి. ఈ మందు ఆకలిని నియంత్రించి ఎక్కువ తినకుండా చేస్తుంది.ఈ ఇంజక్షన్ కోర్సుతో 15 శాతం వరకు బరువు తగ్గుతారని నోవో నార్డిస్ కంపెనీ చెప్పింది.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…