Banana Video: ఇంట్లో అరటి చెట్టు ఉంటే ఇన్ని లాభాలా..?దీని గురించి ఓసారి తెలుసుకుందాం..(వీడియో)

|

Sep 22, 2021 | 10:36 PM

భారతదేశంలో అరటి కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యానికికైనా అరటిపండ్లు, ఆకులు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇక అరటిలో అనేక రకాల జాతులున్నాయి. అరటి చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం మీ ఇంట ఉన్నట్టే..

భారతదేశంలో అరటి కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యానికికైనా అరటిపండ్లు, ఆకులు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇక అరటిలో అనేక రకాల జాతులున్నాయి. అరటి చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం మీ ఇంట ఉన్నట్టే.. ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం ఔషధాల గనిగా చెప్తారు. అరటి చెట్టు, పండు, పువ్వులో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అరటి చెట్టు రసం తీపి, వగరు రుచులు కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. మంచి వీర్య పుష్టి ని పెంచుతుంది. మూత్ర పిండాలలో రాళ్ళను, ఉదరంలోని క్రిములను, సెగరోగములును , రక్తపైత్యాన్ని పోగొడుతుంది.

అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా కాపాడుతుంది. భోజనం తరువాత ఒక్క అరటి పండు తిన్నారంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.రోజూ అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు తగ్గుతాయి. అరటిపువ్వు తో వడియాలు కూడా చేస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాదు మంచి ఆరోగ్యం కూడా. అరటిఆకులో భోజనం చేయడం వలన జ్వరం, క్షయ, ఉబ్బసం మొదలయిన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు అరటి ఆకులో భోజనం ఆయుష్సు పెంచుతుందంటారు.

రుతుక్రమంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు బాగా మగ్గిన అరటి పండుని దేశీయ ఆవునెయ్యి తో కలిపి రోజుకి మూడు సార్లు తింటే రక్త స్రావం అదుపులోకి వస్తుంది. పచ్చి ఉసిరికాయ రసంలో అరటి పండు, తేనె , పటికబెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటే ఉంటే స్త్రీలలో వైట్‌ డిశ్చార్జ్‌ తగ్గుతుంది. కాలిన గాయాలపై బాగా పండిన అరటిపండు గుజ్జుని లేపనంగా రాస్తే.. త్వరగా నయమవుతుంది. తెల్ల బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతున్నవారు అరటి చెట్టు దూటనుంచి రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనంగా రాస్తుంటే తెల్ల బొల్లి మచ్చలు పోతాయి. రోజు పరగడుపున ఒక చక్కరకేళి అరటిపండుని తగినంత గోముత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతటి ఉబ్బస రోగమైనా అదుపులోకి వస్తుంది. అరటికి హెచ్‌ఐవీ వైరస్‌పై పోరాడే అధిక శక్తి ఉంది. అరటిలో ఉండే ‘బాన్‌లెక్‌’ అనే రసాయనం హెచ్‌ఐవీ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని నిపుణులు తేల్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Girl friend Video: గర్ల్‌ఫ్రెండ్‌కు రూల్స్‌.. విసిగిపోయిన అమ్మాయి ఏంచేసిందంటే..(వీడియో వైరల్ )

 Man Vs Aliens Video: అందుకే ఏలియన్స్‌పై కాల్పులు చేశా..? నిందితుడి కామెంట్స్ వైరల్ అవుతున్న వీడియో

 Balakrishna Sensational Comments Video: మా ప్రభుత్వం రాగానే.. ఒక్కొక్కరి సంగతి చూస్తాం.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్…(వీడియో)

 Ek Number News Live Video: కుప్పలు తెప్పలుగా కండోమ్‌లు.. చింత చెట్టుకు నెత్తుటి పంట.. (వీడియో)

Follow us on