Girl friend Video: గర్ల్‌ఫ్రెండ్‌కు రూల్స్.. విసిగిపోయిన అమ్మాయి ఏంచేసిందంటే..(వీడియో వైరల్ )
స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏం బంధమైన కలకాలం నిలవాలంటే.. నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకమనే పునాది గట్టిగా లేకపోతే ఎంతటి బంధమైనా ఎంతోకాలం నిలవదు. మరీ ముఖ్యంగా ప్రేమలో అనుమానం ఉంటే.. అది మధ్యలోనే తెగిపోతుంది. ఏ రిలేషన్ అయినా...
స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏం బంధమైన కలకాలం నిలవాలంటే.. నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకమనే పునాది గట్టిగా లేకపోతే ఎంతటి బంధమైనా ఎంతోకాలం నిలవదు. మరీ ముఖ్యంగా ప్రేమలో అనుమానం ఉంటే.. అది మధ్యలోనే తెగిపోతుంది. ఏ రిలేషన్ అయినా సరే ఎదుటివారికి తగిన స్పేస్ ఇస్తేనే ఆ బంధం మరింత బలపడుతుంది. లేదంటే అర్థాంతరంగా ముగుస్తుంది. ఇదే అనుభవం ఎదురయ్యింది అమెరికా యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని కరోలిన్‌కి. ఆమె బాయ్‌ఫ్రెండ్ తమ రిలేషన్ కొనసాగాలంటే.. కరోలిన్ 11 నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పాడట.
తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన నియమాల లిస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటూ ఆశ్చపోతున్నారు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ ‘కంట్రోలింగ్’ స్వభావం గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఇంతకీ అతను విధించిన నియమాలేంటంటే.. ఆమె బయట తినడం, తాగడం, టైట్ బట్టలు వేసుకోవడం చేయకూడదట. ఇంకా ఆమెన అబ్బాయిలతో కలవకూడదట. అతను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తియ్యకూడదని షరతు పెట్టాడట. రాత్రి 9 గంటలయ్యేసరికి కరోలిన్ తన హాస్టల్‌కి చేరుకోవాలట. పార్టీలకు హాజరు కావడానికి కూడా ఆమెకు పర్మిషన్ లేదు. ఇవండీ కరోలిన్‌కి తన బాయ్‌ఫ్రెండ్ పెట్టిన నియమాలు. ఇన్ని రూల్స్ పెట్టాక ఏ అమ్మాయి మాత్రం అలాంటి వాళ్లను ఇష్టపడుతుంది చెప్పండి. కరోలిన్ కూడా అదే చెయ్యలానుకుంటుందట.. తన నియమాల లిస్ట్‌ను స్క్రీన్‌షాట్ షేర్ చేసిన కరోలిన్.. అతడితో బంధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఆమె నిర్ణయంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Man Vs Aliens Video: అందుకే ఏలియన్స్‌పై కాల్పులు చేశా..? నిందితుడి కామెంట్స్ వైరల్ అవుతున్న వీడియో
Ek Number News Live Video: కుప్పలు తెప్పలుగా కండోమ్‌లు.. చింత చెట్టుకు నెత్తుటి పంట.. (వీడియో)
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

