AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KNOW THIS :లూడో లవ్‌స్టోరీ: పాక్‌ యువకుడితో రాజస్థాన్‌ వివాహిత ప్రేమ.. ఆటోవాలా ఎంట్రీతో అంతా రివర్స్..(వీడియో)

KNOW THIS :లూడో లవ్‌స్టోరీ: పాక్‌ యువకుడితో రాజస్థాన్‌ వివాహిత ప్రేమ.. ఆటోవాలా ఎంట్రీతో అంతా రివర్స్..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Feb 01, 2022 | 9:17 PM

Share

సోషల్‌మీడియా ఛాటింగ్‌ యాప్స్‌లో అపరిచత వ్యక్తులతో పరిచయాలు ప్రేమకు దారితీస్తున్నాయి. ముక్కు మొహం తెలియని వ్యక్తితో లేదా యువతిలో ప్రేమలో పడటం. కన్నవారిని వదిలేసి, ఏకంగా తమ ప్రేమను గెలవాలన్న పిచ్చి కోరికతో దేశం కానీ దేశంకు వెళ్లి చిక్కుల్లో పడుతున్న

సోషల్‌మీడియా ఛాటింగ్‌ యాప్స్‌లో అపరిచత వ్యక్తులతో పరిచయాలు ప్రేమకు దారితీస్తున్నాయి. ముక్కు మొహం తెలియని వ్యక్తితో లేదా యువతిలో ప్రేమలో పడటం. కన్నవారిని వదిలేసి, ఏకంగా తమ ప్రేమను గెలవాలన్న పిచ్చి కోరికతో దేశం కానీ దేశంకు వెళ్లి చిక్కుల్లో పడుతున్న వారి ఘటనలు ఈ మధ్య కాలం ఎక్కువ అవుతున్నాయి. ఇక తాజాగా అలాంటి ఓ విచిత్ర ఘటనే తెర మీదకు వచ్చింది. ఆన్‌లైన్‌ లూడో గేమ్‌ ద్వారా పరిచయమైన యువకుడి కోసం ఓ వివాహిత తన భర్త, పిల్లలను వదిలేయాలనుకుంది. ప్రియుడితో కలిసి జీవించేందుకు ఏకంగా దేశ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించింది. కానీ చివరికి పోలీసుల రంగప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన వివాహితకు ఆన్‌లైన్‌‌లో లూడో గేమ్‌కు బాగా అడిక్ట్‌ అయింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన అలీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ముందు తమది స్నేహమనుకున్నారు. ఆతర్వాత ప్రేమగా భావించారు. ఇద్దరు కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు. ఈ క్రమంలో పాక్‌ యువకుడితో కలిసి జీవించాలని.. భర్త, పిల్లలను వదిలేసి రాజస్థాన్ నుంచి బయలుదేరి పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు బయలుదేరింది వివాహిత. అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న వాఘా సరిహద్దుకు చేరుకోవాలని ప్రియుడు అలీ ఆమెకు సూచించాడు. దీంతో ఆమె వాఘా సరిహద్దు వరకు వెళ్లేందుకు ఆమె ఓ ఆటోను మాట్లాడుకుంది.

ఆరునెలల పరిచయమేనట.. ఈక్రమంలో మహిళను ఫలానా చోటుకు తీసుకురమ్మని పాక్‌ యువకుడు ఫోను ద్వారా ఆటో డ్రైవర్‌కు ముందే సూచించాడు. అయితే దీనిపై అనుమానం వచ్చిన డ్రైవరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వాఘా సరిహద్దుకు చేరుకుని రాజస్థాన్‌ మహిళను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ అధికారులు ఆమెను ప్రశ్నించడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఆన్‌లైన్ లూడో ద్వారా పాక్ యువకుడితో ఆమెకు ఆరు నెలల కిందట పరిచయం ఏర్పడినట్టు ఆ మహిళ తెలిపింది. ఆమె వద్ద కొంత మేరు డబ్బు, నగలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సరిహద్దు పోలీసులు. మరోవైపు, కుటుంబసభ్యుల కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమయ్యారు. అమృత్‌సర్‌ చేరుకున్న కుటుంబసభ్యులకు పోలీసులు ఆమెను అప్పగించారు. ఆమెకు వివాహం కాగా, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడని ధోల్‌పూర్ ఎస్పీ తెలిపారు. ఈ ఘటన అనంరతం సదరు మహిళకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఇంటికి పంపించారు పోలీసులు.

Published on: Feb 01, 2022 08:27 PM