అదే పనిగా కంప్యూటర్‌ చూస్తున్నారా.? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు… వీడియో

Updated on: Sep 28, 2021 | 11:17 PM

మారుతున్న కాలానికి తగ్గట్టు టెక్నాలజీ ఎంతగానో పెరుగుతోంది. ప్రస్తుతం కంప్యూటర్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్‌ విషయంలో కూడా కంప్యూటర్‌ వాడకం అనివార్యంగా మారింది.

మారుతున్న కాలానికి తగ్గట్టు టెక్నాలజీ ఎంతగానో పెరుగుతోంది. ప్రస్తుతం కంప్యూటర్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్‌ విషయంలో కూడా కంప్యూటర్‌ వాడకం అనివార్యంగా మారింది. ఇక గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చునే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతోన్న పనితీరుకు తగ్గట్లు మారక తప్పని పరిస్థితి. దీంతో గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అదే పనిగా కంప్యూటర్‌ చూసే వారిలో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ అనే సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్‌ ముందు కూర్చొనే విధానం, చుట్టుపక్కల ఉన్న లైటింగ్‌, అలాగే అంతకు ముందు ఉన్న కంటి సమస్యల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, కళ్లు పొడిగా మారడం, కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో దురద వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కళ్ల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు.. ఇలా చేస్తే కళ్లకింద నల్లటి వలయాలు మటుమాయం.. వీడియో

Viral Video: కేరళ విల్వద్రినాథ ఆలయంలో గజరాజు బీభత్సం.. వీడియో